Header Banner

రోజూ తినే ఆహారంలో బీట్ రూట్ తీసుకుంటున్నారా!అయితే మీ బాడీలో ఈ పార్ట్స్..

  Sat Feb 22, 2025 10:05        Health

బీట్‌రూట్ ఆరోగ్యానికి మంచిది. అందుకే చాలా మంది దీనిని జ్యూస్ గా లేదా సలాడ్లలో కలిపి తీసుకుంటారు. కానీ, బీట్‌రూట్‌ను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కొంతమందికి బీట్‌రూట్ విషంలా పనిచేస్తుందని అంటున్నారు.. ఎక్కువగా బీట్‌రూట్ తినటం వల్ల శరీరంలోని ఈ అవయవం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవును, మీరు చదువుతుంది నిజమే. బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది.

 

అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. ఇది మూత్ర ఆక్సలేట్ విసర్జనను పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల అభివృద్ధికి దారితీస్తుంది. అందుకే బీట్‌రూట్ జ్యూస్‌ను మితంగా తాగాలని సూచిస్తున్నారు. అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

అనాఫిలాక్సిస్ అనేది ఒక అలెర్జీ కారకానికి తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. దీని వలన శరీరం తీవ్ర సున్నితత్వం చెందుతుంది. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల, అలెర్జీకి దారితీస్తుంది. దాని ఫలితంగా గొంతు బిగుతుగా మారటం, బ్రోంకోస్పాస్మ్ ఏర్పడవచ్చు.

 

బీట్‌రూట్ లేదా ఎరుపు రంగు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బీటూరియా లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం లేదా మలం ఎర్రగా మారడాన్ని బీటూరియా అంటారు.

 

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే పొత్తికడుపులో తిమ్మిర్లు వస్తాయి. అలాగే, మహిళలకు గర్భధారణ సమయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ అంత సురక్షితం కాదని అంటున్నారు. ఇందులో ఎక్కువ నైట్రేట్ తీసుకునే గర్భిణీ స్త్రీలకు శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ నీలి-బూడిద చర్మం ఏర్పడే అవకాశం ఉంటుంది.

 

నివేదికల ప్రకారం,.. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #health #beetroot #daily #diet